‘చిరు’సాయం.. నవోదయం
సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు
అనాథ బాలబాలికలకు కొండంత అండ
ఈ నెల 31వరకు ఆపరేషన్ స్మైల్
కొనసాగుతున్న అధికారుల సర్వే
కరీంనగర్‌టౌన్: జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, కార్మికశాఖ సంయుక్తంగా యేటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట అనాథల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇటీవల ఆపరేషన్ స్మైల్ ప్రారంభం కాగా.. ఈనెల 2న సర్వేబృందం కరీంనగర్ ప్రాంతంలోని ఓ రైస్ మిల్‌లో బాలకార్మికుడి గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు.
ఎవరెవరిని సంరక్షిస్తారంటే..
బిక్షాటన చేసేవాళ్లు, తప్పిపోయిన చిన్నారులు, బస్టాండ్‌ల్లోని బాలలు, వీధి, అనాథ, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెత్త సేకరించే వారు, మతి స్థిమితం లేనివారిని రక్షిస్తారు. బాల్య వివాహా లను అడ్డుకుంటారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే విభాగాల్లో చిన్నారులను గుర్తించి సంరక్షిస్తారు. సందర్భానుసారంగా ఆయా యజమానులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. అనాథ బాలల సంరక్షణలో భాగంగా సీడబ్ల్యూసీ (బాలల సంక్షేమ సమితి)ఎదుట హాజరుపర్చుతారు. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతారు.
శాఖల సమన్వయంతో
ఆర్థిక ఇబ్బందులు, అవగాహన రాహిత్యం, పాఠశాలలు దగ్గరలో లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం యేటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. పోలీసు, బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, ఇతరశాఖలు, స్వచ్ఛంద సంస్థలతో తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్ల కు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కోబృందంలో ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్యాశాఖల సమన్వయంతో వ్యాపారసంస్థలు, ఇ టుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీ చేస్తున్నారు. వీధి బాలలు, బాల కార్మికులు, డ్రాపౌట్లు, వేధింపులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు. అదృశ్యమైన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. తద్వారా ఆచూకీ లభించే అవకాశముంది. ఐదేళ్లల్లో ఆపరేషన్ ము స్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా జిల్లాలో 587మందిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
జిల్లాలో కార్యక్రమం ఇలా..
సంవత్సరం ఆపరేషన్ ఆపరేషన్ స్మైల్ ముస్కాన్
2021 244 45
2022 58 31
2023 17 07
2024 19 25
2025 39 102
31 వరకు కార్యక్రమం
ఈనెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కొనసాగుతుంది. ఏటా ప్రత్యేకడ్రైవ్ చేపట్టి బాల కార్మికులను గుర్తిస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పనిలో పెట్టుకునే యాజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆపదలో ఉన్నవారి సమాచారం కోసం పోలీసు, రెవెన్యూ, శిశుసంక్షేమ, విద్య, కార్మిక విభాగం అధికారులతో పాటు చైల్డ్‌లైన్(1098)కి ఫోన్ చేస్తే రక్షణ కల్పిస్తాం.
– సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి
‘చిరు’సాయం.. నవోదయం


