హామీల అమలు.. పల్లెకు సొబగులు..
కొత్త సర్పంచులు హామీల అమలు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులు విషయాన్ని పక్కనబెట్టి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కరీంనగర్ మండలం చేగుర్తి సర్పంచ్ బాషవేణి సరోజనమల్లేశం ముళ్లపొదలు, చెట్లను జేసీబీతో తొలగించారు. దుబ్బపల్లి సర్పంచ్ మోతె ప్రశాంత్‌రెడ్డి తాగునీటి సరఫరా గేట్‌వాల్వ్‌కు మరమ్మతు చేయించారు. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణిమహేందర్ ఎస్సారెస్పీ కాలువలో జేసీబీతో పూడిక తీయించారు. జూబ్లీనగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్ పాఠశాల సమీపంలోని కట్టుకాలువలో పూడిక తొలగించారు. బహుదూర్‌ఖాన్‌పేట సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతిరెడ్డి మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు షెడ్ నిర్మిస్తున్నారు. చెర్లభూత్కూర్‌లో సర్పంచ్ కూర నరేశ్‌రెడ్డి డ్రైనేజీ శుభ్రం చేయించారు. చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య పంచాయతీ భవనానికి రంగులు వేయించారు. చేతిబోర్లకు మరమ్మతు చేయిస్తున్నారు. ఇరుకుల్ల సర్పంచ్ బుర్ర రమేశ్‌గౌడ్ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఫోన్ చేస్తే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. –కరీంనగర్‌రూరల్
హామీల అమలు.. పల్లెకు సొబగులు..


