చెడుకు దూరంగా ఉండాలి
తిమ్మాపూర్(మానకొండూర్): సురక్షిత బాల్య ం కోసం జిల్లాలో స్నేహిత కార్యక్రమం అమలు చేస్తున్నట్లు 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్ తెలిపారు. మండలంలోని నుస్తులాపూర్ ఉన్నత పాఠశాల, రామకృష్ణ కాలనీలోని గన్నేరువారం మహత్మా జ్యోతిరావుఫూలే గురుకుల హాస్టల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన స్నేహిత అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సెల్‌ఫోన్‌తో మంచి కన్నా చెడు ఎక్కవ ఉందన్నారు. తెలిసి తెలియక చెడుదారిలో వెళ్లొద్దన్నారు. చిన్న వయసులో వాహనాలు నడపటం, ఆల్కహాల్ సిగరెట్ తాగడం ద్వారా శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. సేఫ్ టచ్.. అన్ సేఫ్ టచ్, విద్య ప్రాముఖ్యత, స్వీయ రక్షణ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 తదితర సేవలపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జువేరియా అవగాహన కల్పించారు. హెచ్‌ఎం రవీందర్, వెంకటరమణ పాల్గొన్నారు.
అంతర్గత రోడ్ల
నిర్మాణానికి ప్రాధాన్యం
కరీంనగర్‌రూరల్: నగరంతో పాటు విలీన గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి ఆరెపల్లిలోని సరస్వతినగర్‌లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, మరో ప్రాంతంలో రూ.11లక్షలతో సీసీరోడ్డు, కోతిరాంపూర్‌లోని గణేశ్‌నగర్ లింక్‌రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అంతర్గత రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చెర్ల పద్మ, ఎట్టెపు వేణు, బత్తిని చంద్రయ్య, బేతి సుధాకర్‌రెడ్డి, గౌరయ్యగౌడ్, సత్తినేని శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎరువుల కొరత లేదు
కరీంనగర్ అర్బన్: యాసంగి సాగుకు సరిపడా ఎరువులున్నాయని, కొరత లేదని జిల్లా సహకార అధికారి రామానుజాచార్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో సహకార సంఘాల ఎరువుల గోదాంలను పరిశీలించారు. భౌతిక నిల్వలు, రికార్డుల్లో వివరాలకు సరిచూశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా హెచ్చు మోతాదులో యూరియా సేకరించిందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో యూరియాకు కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, నోడల్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు.
121 జీవో ఎత్తివేయాలి
కరీంనగర్‌కల్చరల్: దేవాదాయశాఖలో 2014లోపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు ఇస్తామని చెప్పి మధ్యలో 121 జీవో తెచ్చి అర్చకులు, ఉద్యోగులకు అన్యాయం చేశారని, 121 జీవో ఎత్తివేయాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస జిల్లా సదస్సు తీర్మానించింది. మంగళవారం కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరఆలయంలో ఉమ్మడిజిల్లా సదస్సు జరిగింది. జిల్లా అధ్యక్షుడు చెన్నోజ్వల నాగరాజాచార్యులు అధ్యక్షతన పలు తీర్మాణాలు అమోదించారు. అర్చక ఉద్యోగులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలన్నారు. శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. 2017లో జీవో 577 ప్రకారం అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు ఉపేందర్ శర్మ, డీవీఆర్ శర్మ, నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ప్రభాకర్ పాల్గొన్నారు.
చెడుకు దూరంగా ఉండాలి
చెడుకు దూరంగా ఉండాలి


