హాజరు నిబంధన ఎత్తేయాలి
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయ లా కళాశాలలో తప్పనిసరి హాజరు నిబంధనను ఎత్తివేసి, అందరు విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు రాయడానికి అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ లా విద్యార్థులు బుధవారం రెండోరోజు నిరసన కొనసాగించారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం 91 మంది విద్యార్థుల్లో సుమారు 40 నుంచి 50 మందికి హాజరు శాతం తక్కువగా ఉందని చెప్పి ఇంటర్నల్స్‌కు అనుమతి నిరాకరించడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 2025లో నిర్వహించిన మొదటి ఇంటర్నల్ పరీక్షల సమయంలో యూనివర్సిటీ అధికారులు పోలీస్ బందోబస్తుతో విద్యార్థులను ఆర్ట్స్ కళాశాల వద్ద పరీక్షా కేంద్రం బయటే నిలబెట్టారని ఆరోపించారు.


