ప్రమాద రహిత జిల్లాగా మార్చుదాం: సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సీపీ గౌస్ ఆలం అ న్నారు. తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం–2026’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే ప్రధాన మార్గాల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్‌స్పాట్లను’ గుర్తించామని, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, కళాశాల చైర్మన్ రమేశ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయకుమార్, రమేశ్, సీఐ సదన్‌కుమార్ పాల్గొన్నారు.
బ్యాంకు భద్రతపై సమీక్ష
బ్యాంకుశాఖలు, ఏటీఎం కేంద్రాల భద్రతపై సీపీ వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకూడదని దిశానిర్దేశం చేశారు. బ్యాంకు ప్రవేశ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, స్ట్రాంగ్‌రూమ్‌లు, ఏటీఎం కేంద్రాల వద్ద హైక్వాలిటీ సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రికార్డింగ్‌ను కనీసం 30రోజుల పాటు భద్రపరచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను అప్రమత్తం చేసేందుకు మేనేజర్ క్యాబిన్, క్యాష్ కౌంటర్లలో పానిక్ బటన్లను ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద మొత్తంలో నగదు తరలించేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. స్థానిక పోలీసు అధికారులతో బ్యాంక్ మేనేజర్లు నిరంతరం సమన్వయంతో ఉండాలన్నారు.
రాహుల్ గాంధీ గొప్ప ఏమిటి?
మానకొండూర్: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌లోని నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీకి ఒక పేరు ఉందని, రాహుల్ గాంధీ దేశానికి ఏం చేశాడని, ఆయన గొప్పెంటో చెప్పాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్ చేశారు. మానకొండూర్‌లో గురువారం మాట్లాడుతూ.. వరంగల్ సభలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. వ్యంగ్యంగా భాష మొదలు పెట్టిందే సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి మాట్లాడితే ఒక్కలాగా, కేటీఆర్ రాహుల్‌గాంధీపై మాట్లాడితే మరోలా ఉంటుందా? అని ప్రశ్నించారు. బీజేపీ పార్లమెంటులో కాంగ్రెస్‌పై దాడులకు దిగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, నెళ్లి మురళి, నెల్లి శంకర్, శాతరాజు యాదగిరి పాల్గొన్నారు.
రామడుగు: మండలంలోని లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, కిష్టంపల్లి, దత్తోజీపేట గ్రామాల రైతుల పంటలకు నీటి కొరత ఏర్పడకుండా గాయత్రి పంపుహౌస్ నుంచి గ్రావిటీ కాలువ కు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరడంతో గురువారం ఆధికారులు 1వ మోటార్‌ను ఆన్‌చేసి పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా రామడుగు, చొప్పదండి మండలాల కాంగ్రెస్ నాయకులు జువ్వాజీ హరీశ్, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, పిండి సత్యంరెడ్డి, అనంతరెడ్డి పూజలు చేశారు.
కొత్తపల్లి: ప్రభుత్వ ఆదేశాలతో టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ ప్రజాబాట గురువారం జరిగింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నిర్వహించే ఈ ప్రజాబాట కార్యక్రమాన్ని కరీంనగర్ టౌన్ 8 సెక్షన్ పరిధిలోని కోతిరాంపూర్‌లో నిర్వహించారు. విద్యుత్ వినియోగం, భద్రతపై అవగాహన కల్పించారు. ఏఈ ఫసీ హైమద్, ఎల్‌ఐ ఫరూక్, ఎల్‌ఐలు అసిరి ప్రకాష్, రవీందర్, ఏఎల్‌ఎంలు అనిల్, రమేశ్ పాల్గొన్నారు.
ప్రమాద రహిత జిల్లాగా మార్చుదాం: సీపీ గౌస్ ఆలం
ప్రమాద రహిత జిల్లాగా మార్చుదాం: సీపీ గౌస్ ఆలం


