ప్రీప్రైమరీని సద్వినియోగం చేసుకోవాలి
తిమ్మాపూర్/కరీంనగర్‌టౌన్/కరీంనగర్ కల్చరల్/కొత్తపల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూ చించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూని ఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్ అందజేశారు. జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. ప్రత్యేక సిలబస్ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు ఉచితంగా షూ అందజేస్తామన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. బుధవారం బోధనను అమలు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సూరం స్వప్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం మంజుల పాల్గొన్నారు.
ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వండి
అంధ విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. రేకుర్తిలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సంగీ తం, గానంలో శిక్షణ ఇవ్వాలని మ్యూజిక్ టీచర్‌కు సూచించారు. పెయింటింగ్స్, అల్లికల కళల్లో రాణిస్తున్న వారికి వివిధ సదుపాయాలు కల్పించాలని, అవసరమైన మెటీరియల్ సమకూర్చాలన్నారు.
23 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు
నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలపై కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ ధర్మకర్తలు, దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో గురువా రం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు త లెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. స్టేజీ, లైటింగ్, సౌండ్‌పై దృష్టి సారించాలన్నారు. ఈవో సుధాకర్, ధర్మకర్తలు శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు.


