ఇంత నిర్లక్ష్యమా?
● సోలార్ ప్లాంట్ కాంట్రాక్టర్‌పై సీఎండీ ఆగ్రహం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ శివారులోని 132 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న 1.4 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ పనుల్లో పురోగతి లేకపోవడంతో కాంట్రక్టర్‌పై టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ ప్లాంట్, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం సీఎండీ పరిశీలించారు. 2 నెలల క్రితం సందర్శన సమయంలో ఉన్న పనులే సోలార్ ప్లాంట్ నిర్మాణంలో కనిపించడంతో కాంట్రాక్టర్‌ను మందలించారు. సోలార్ ప్లాంట్, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్(ప్రాజెక్టు) మోహన్‌రావు, సీఈ(ప్రాజెక్టు) సురేందర్, కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు, డీఈ జంపాల రాజం, డీఈ(కన్‌స్ట్రక్చన్) చంద్రమౌళి, ఈఈ(సివిల్) శ్రీనివాస్, ఏడీఈ(కన్‌స్ట్రక్చన్) అనిల్, టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్, ఏఈ శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలి
విద్యానగర్(కరీంనగర్): మేడారం–2026 సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం మేడరంలో కరీంనగర్ రీజియన్ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కరీంనగర్ రీజియన్ రీజనల్ మేనేజర్ బి.రాజు మాట్లాడుతూ.. డిపోల మధ్య ఎలాంటి పోటీ ఉండకుండా జాతరను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ప్రయాణపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. జాతర విధులు నిర్వర్తించే సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. జాతర విజయవంతానికి తమవంతు కృషి చేస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. క్యూ రేలింగ్స్, బుకింగ్ పాయింట్ల ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు చెందిన మేనేజర్లు, అకౌంట్ ఆఫీసర్, సూపర్‌వైజర్లు, ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై జాగ్రత్త
కరీంనగర్: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్‌లోని మహిళల డిగ్రీ కళాశాలలో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ–పిల్లల సంరక్షణపై ఈ కార్యక్రమం జరిగింది. డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైం డీఎస్పీ కోత్వాల్ రమేశ్, సబ్ ఇన్స్‌పెక్టర్ అనిల్, జ్యోత్స్న, కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఇన్‌చార్జి శ్రావణి పాల్గొన్నారు.


