మున్సిపోల్స్‌లో విజయం ఖాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
హుజూరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీశక్తి చాటి చెప్పాలన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మున్సిపాలిటీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. బల్దియాల పరిధి విస్తరిస్తున్నా.. మౌలిక వసతులు కల్పించలేని దుర్భరస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధికి చేసిందేమి లేదని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నాయకులు రఘు, రాజేందర్, రాజు, రాజు, శ్రీనివాస్, రమణారెడ్డి, దేంచనాల శ్రీనివాస్, మోడపు వినయ్ తదితరులు పాల్గొన్నారు.


