దారిద్య్రానికి చెక్‌! | - | Sakshi
Sakshi News home page

దారిద్య్రానికి చెక్‌!

Jan 7 2026 7:29 AM | Updated on Jan 7 2026 7:29 AM

దారిద

దారిద్య్రానికి చెక్‌!

దారిద్య్రానికి చెక్‌! ● -hÌêÏÌZ »êÏMŠæ ÝëµrÏ Ð]l§ýlª Ð]l$ǰ² Æý‡„ýS-׿ ^èlÆý‡ÅË$ బ ● విస్తరణ పూర్తి, సదాశివపల్లిలో ఐలాండ్‌ ● నగరంలో వేగం తగ్గింపునకు రంబుల్‌ స్పీడ్‌ బ్రేకర్లు ● రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో కలెక్టర్‌, సీపీ సదస్సులు

అవగాహన కల్పిస్తాం

రోడ్డు ప్రమాదాలకు ముకుతాడు

ప్రమాదాలకు నిలయమైన సదాశివపల్లి వై జంక్షన్‌

2023 2024 2025

ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 203 188 186

రోడ్డు ప్రమాదాలు 470 586 579

మొత్తం ప్రమాదాలు 673 774 765

మరణాలు 215 200 192

గాయపడ్డవారు 651 716 701

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ గౌస్‌ ఆలం దృష్టి సారించారు. అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణనష్టాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో నగరంలో ప్రమాదాలకు కారణమవుతున్న పలు బ్లాక్‌స్పాట్లు, జంక్షన్లను గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన పద్మనగర్‌, సదాశివపల్లి, ఎన్టీఆర్‌ జంక్షన్లపై దృష్టి సారించారు. ఇప్పటికే పద్మనగర్‌ జంక్షన్‌ విస్తరించారు. రోడ్డు సేఫ్టీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చించి, సదాశివపల్లి వైజంక్షన్‌ వద్ద ఐలాండ్‌ నిర్మించేందుకు సీపీ చొరవ చూపించారు. ఇందుకోసం కొంత భూసేకరణ, ఐలాండ్‌ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయి. త్వరలోనే ఇక్కడ ఐలాండ్‌ నిర్మించనున్నారు.

ప్రమాదాల నేపథ్యంలో అవగాహనకు శ్రీకారం..

కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిఽధిలో రెండేళ్లుగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గుతున్నా.. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు వేగం ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు, కూడళ్లకు సమీపంలో రంబుల్‌ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. యూటర్న్‌ల వద్ద యాక్సిడెంట్లు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రతీ ప్రాంతాన్ని సీపీ గౌస్‌ ఆలం స్వయంగా పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తున్నారు.

ముఖ్యంగా వేగం ఈ ప్రమాదాలకు ప్రథమ కారణం కాగా, అవగాహన లోపం రెండో కారణమని గుర్తించారు. జనవరి మొత్తం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులతోపాటు కాలేజీ యువతకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్‌ పమేలా సత్పతి కూడా హాజరవనున్నారు.

కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. రోడ్‌సేఫ్టీ, నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. వేగంతోపాటు నిబంధనలు పాటించని వాహనదారుల వల్లే ప్రాణనష్టం సంభవిస్తుంది. మృతుల్లో అధికశాతం ద్విచక్రవాహనదారులే కావడం వల్ల హెల్మెట్‌ వినియోగం పెరిగేలా, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై అవగాహన కలిగేలా చర్యలు రూపొందించాం. ముఖ్యంగా విద్యార్థులు, యువత, వాహనదారులు లక్ష్యంగా పలు విభిన్న కార్యక్రమాలు రూపొందించాం. – సీపీ గౌస్‌ ఆలం

దారిద్య్రానికి చెక్‌!1
1/1

దారిద్య్రానికి చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement