వలసజీవుల బతుకుచిత్రం | - | Sakshi
Sakshi News home page

వలసజీవుల బతుకుచిత్రం

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

పాలకుర్తి మండలం కుర్మపల్లి శివారులో వలసజీవులు

ఊరు లేవకముందే ఊళ్లకు పయనమై గాజులు, బొట్టుబిళ్లలు, ఇంటిసామాన్లు అమ్ముతున్నారు వలసజీవులు. జానెడు పొట్టకోసం అనేక తిప్పలు పడుతున్నారు. నాలుగు గుంజలు, నాలుగు కవర్లు ఉంటే చాలు.. గూడుగా మార్చుకొని జీవనం సాగిస్తున్నారు. సరిపడా గిన్నెలు, వంటకు కట్టెలు, నీళ్లకు క్యాన్‌లు, నేలపై చద్దర్లు, ఒంటిపై బట్టలు వాటిని ఆరేసేందుకు దండాలు.. ఇవీ వాళ్లగూడుకు ఆధారాలు. ఒకచోట ఆగకుండా కాలంతోపాటు పయనిస్తూ ఊరు చివరన చిన్నగుడారాలు ఏర్పాటు చేసుకుంటున్న వలసజీవుల కుటుంబాల బతుకుపోరాటం వర్ణణాతీతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుర్మపల్లి శివారులో వలసజీవన కుటుంబాల గూడు చిత్రం ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించింది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement