వృద్ధులను ఆశ్రమంలో చేర్పించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వృద్ధులను ఆశ్రమంలో చేర్పించిన పోలీసులు

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

కరీంనగర్‌రూరల్‌: నేరాలను నియంత్రించి శాంతిభద్రతలు కాపాడుతున్న పోలీసులు అనాథ వృద్ధులను చేరదీసి ఆశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటారు. వివరాలు.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన శ్రీరాంఅంజయ్య, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన బూర్గు రాజయ్య, రామడుగు మండలం దేశరాజుపల్లెకు చెందిన ఆవుదుర్తి సతీశ్‌ గ్రామాల్లో అనాథలుగా ఉండి ఆహారం లేకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించిందనే సమాచారంతో కరీంనగర్‌రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ముగ్గురిని కరీంనగర్‌కు తరలించి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ముగ్గురికి అవసరమైన మందులు, పండ్లు అందించి హౌజింగ్‌బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథఆశ్రమంలో చేర్పించారు. ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement