● సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్‌టౌన్: సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం భారత కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని, అలాంటి పార్టీకి ప్రజలే వెన్నుదన్నుగా నిలవాలని, వందేళ్లుగా ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సీపీఐకి విరివిగా ఆర్థిక సాయాన్ని అందించాలని సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఇంటింటికి సీపీఐ సామూహిక నిధి, విరాళాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం గణేశ్‌నగర్ కమాన్ చౌరస్తాలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. దేశంలో 1925 డిసెంబర్ 25న సీపీఐ ఆవిర్భవించిందని, నాటినుంచి నేటి వరకు వందేళ్లుగా ప్రజా సమస్యలే తమ సమస్యలుగా భావించిన పార్టీ కమ్యూనిస్టు పార్టేనని అన్నారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కొయ్యడ సజన్‌కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య తదితరులున్నారు.


