ఇసుక లోడింగ్ నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం
మానకొండూర్ రూరల్/వీణవంక: ఇసుక క్వారీ వద్ద లోడింగ్ చేసే సమయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, నర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం మండలంలోని పచ్చునూర్, వీణవంక మండలంలాల్లోని మామిడాలపల్లి, చల్లూరు ఇసుక క్వారీలను, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను సీసీ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు. రవాణా చేసే లారీ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు కచ్చితంగా రికార్డు చేయాలన్నారు. లారీ డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, వాహనదారులు, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వీరి వెంట ఏసీపీ మాధవి, తహసీల్దార్లు విజయ్‌కుమార్, అనుపమ, టీజీఎండీసీ విజయ్ తదితరులు ఉన్నారు.
తిమ్మాపూర్(మానకొండూర్): హెల్మెట్‌ను శిరోభారంగా భావించొద్దని, వాహనదారులు రహదారి నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. జాతీయరోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం వేర్వేరు కార్యక్రమాల్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. అజా గ్రత్త, మద్యం తాగి అతివేగంగా వాహనం నడపడం కూడా కారణమేనన్నారు. యజమానులు కండీషన్ లేని వాహనాలను ఉపయోగించ డం, అనుభవం లేని డ్రైవర్లకు వాహనం అప్పగించడం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వా హనం నడిపేటప్పుడు సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించడంతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించరాదని అన్నారు. కార్యక్రమంలో సీఐ సదన్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, ఎంవీఐ రవికుమార్ పాల్గొన్నారు.
రామడుగు(చొప్పదండి): మండలంలోని దేశరాజ్‌పల్లి గ్రామ శివారులో చెరువుకట్ట కింద పొలాల్లో ఆదివారం రాత్రి పులి సంచరించినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలాల గట్టుపై పులి అడుగులు కనిపించినట్లు రైతులు తెలిపారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారణ చేయాల్సి ఉంది.
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ విద్యు త్ వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను మరింత విస్త్తృత పరిచినట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి టోల్ ఫ్రీ సేవలు నిర్వహిస్తారని, 16 సర్కిళ్ల వినియోగదారులు సద్విని యోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫేయిల్యూర్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీటర్ల మార్పు, అన్నిరకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించి పేరు మార్పు, కేటగిరీ, లోడ్ మార్పు తదితర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి సేవలు పొందాలని కోరారు. 24/7 అందుబాటులో ఉండే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇసుక లోడింగ్ నిబంధనలు పాటించాలి
ఇసుక లోడింగ్ నిబంధనలు పాటించాలి


