‘ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?’ | BJP Etela Rajender Slams Telangana Govt Over BC Bill | Sakshi
Sakshi News home page

‘ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?’

Aug 2 2025 3:16 PM | Updated on Aug 2 2025 4:10 PM

BJP Etela Rajender Slams Telangana Govt Over BC Bill

హైదరాబాద్‌:  బీసీల కళ్లలో మట్టికొట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని బీజేపీ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బీసీ శాతం 23కు పడిపోయిందని,  ఆ పార్టీకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 2) ఇండిరా పార్క్‌ వద్ద బీజేపీ చేపట్టిన ఓబీసీ మహాధర్నాలో ఈటల మాట్లాడారు. 

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అనేక అంశాలున్నాయి. స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. డిక్లరేషన్‌ల పేరిట అనేక హామీలిచ్చారు. రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయామనీ, మోస పోయామని ప్రజలు అనుకుంటున్నారు. 

రిజర్వేషన్ల పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను నిలువునా మోసం చేస్తున్నారు. 20 నెలలు దాటిపోయింది రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?,  మోసం చేసిన కాంగ్రెస్ అని ప్రజలు డిసైడ్ అయ్యారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. పాత పద్ధతుల్లో ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే సీఎం నీ భరతం పడతామని హెచ్చరికలు ఇస్తున్నాం..ఎన్ని హామీలున్నాయో గుర్తుందా రేవంత్ రెడ్డి..?

బీసీ రిజర్వేషన్లపై కమిషన్ వేసిన రేవంత్ రెడ్డి, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌కు చట్ట బద్దత ఉంటదా..?, రిజర్వేషన్లపై మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు. చట్ట బద్దంగా 9th సెడ్యూల్ ల్లో చేర్చుకొని రిజర్వేషన్లను సాధించుకున్న తొలి రాష్ట్రం తమిళనాడు.డిల్లీకి వెళ్ళి రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు, 

బీజేపీపై నెపం వేసే కుట్రలు చేస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఆర్టికల్ 340, కమిషన్ ఎంక్వారి 1942 ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళాలి. బీసీలను మోసం చేసే కుట్రలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. రేవంత్‌కు ఆత్మశుద్ధి ఉంటే మంత్రి వర్గంలో బీసీలకు ఏం ఇచ్చారు..? ఏం శాఖలు ఇచ్చారో చెప్పాలి.  బీఆర్‌ఎస్‌ ఉన్నంత కాలం బీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.  బీఆర్‌ఎస్‌ ఉన్నంత కాలం బీసీ అధ్యక్షుడు కయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హయాంలో బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, భవిష్యత్‌లో కూడా చేస్తారనే నమ్మకం లేదు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి నీ భరతం పడతాం’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement