
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. ‘‘తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ హెచ్చరించారు.
‘‘బీసీలకు 42 శాతం కోటా పేరుతో రేవంత్ సర్కార్ డ్రామా ఆడుతోంది. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితేంటి?. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు’’ అంటూ ఈటల గుర్తు చేశారు.
ఈటల వ్యాఖ్యలు.. మహేష్‌గౌడ్ కౌంటర్
ఈటల వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు నోరు తెరవాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎక్కడ ఆగిందో ఈటల చెప్పాలి. ముదిరాజ్ బిడ్డను అంటావ్ ఇప్పుడు బీసీల కోసం మాట్లాడు.. నోటి దగ్గరి ముద్ద లాక్కుంటున్నా కానీ.. ఈటల, సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కోర్టులో పిల్స్ వేస్తున్నారు’’ అంటూ మహేష్ గౌడ్ మండిపడ్డారు.