
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 చిరు వ్యాపారుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అరటి పండ్ల బండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు, ఇతర దుఖాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రమాదం..షార్ట్ సర్క్యూట్ వల్లేనని తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.