'డబుల్' ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం | women suicide attempt for double bed room home in karim nagar | Sakshi
Sakshi News home page

'డబుల్' ఇంటి కోసం ఆత్మహత్యాయత్నం

Mar 19 2016 4:08 PM | Updated on Sep 29 2018 4:44 PM

సర్కారు వారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాలో తన పేరు లేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

శంకరపట్నం : సర్కారు వారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల జాబితాలో తన పేరు లేదంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి 20 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించగా... అధికారులు 25 మంది పేర్లతో ఓ జాబితాను రూపొందించారు. దీనిపై చర్చించేందుకు శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన పైడిపల్లి రేణుక (30) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే ఎంపీపీ విజయ ఆమె చేతిలోని పురుగుల మందు డబ్బా లాగేసుకున్నారు. జాబితాలో చోటు కల్పిస్తామని చెప్పి ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement