సీనియర్ల దాడి: విద్యార్థి పరిస్థితి విషమం | student injured in karim nagar district | Sakshi
Sakshi News home page

సీనియర్ల దాడి: విద్యార్థి పరిస్థితి విషమం

Feb 9 2016 10:15 AM | Updated on Nov 9 2018 4:31 PM

సీనియర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు.

సుల్తానాబాద్: సీనియర్ విద్యార్థుల దాడిలో ఓ విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్ మండలం సీతారాంపుర్‌కి చెందిన రాజేందర్(17)స్థానిక సైన్స్‌వింగ్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అతని ఇంటికి వచ్చిన ఐదుగురు సీనియర్ విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు అతని పై కత్తులతో దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్నేహితుల మధ్య చిచ్చు రేగడానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement