ఎర్రవల్లి: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన తనయుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డిలు సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్‌ను కోరారు.
అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు. ఈ మేరకు సిట్‌కు కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి సిట్ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.


