వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల గొంంతుకోసారంటూ విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు(బుధవారం, నవంబర్ 26వ తేదీ) వరంగల్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీ విస్తరణ చేపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారు. తెలంగాణను రాహుల్‌కు ఏటీఎంలా మార్చారు’ అంటూ ధ్వజమెత్తారు.
ఈరోజు కేటీఆర్.. వరంగల్ పర్యటనకె వెళ్లారు. ఉదయం 11:30 గంటలకు హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బీరవెళ్లి భారత్ కుమార్‌రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు. అపై మధ్యాహ్నం 3 గంటలకు జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్.


