మంచి రోజు.. మంచి వార్త | Varun Tej And 14 Reels Plus | Sakshi
Sakshi News home page

మంచి రోజు.. మంచి వార్త

Mar 19 2018 12:32 AM | Updated on Mar 19 2018 12:32 AM

Varun Tej And 14 Reels Plus - Sakshi

వరుణ్‌ తేజ్‌

‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ విజయాలతో జోష్‌గా ఉన్న వరుణ్‌ తేజ్‌ తదుపరి చిత్రం ఖరారైంది. ‘అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో  వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా 14 రీల్స్‌ ప్లస్‌ అనే బేనర్‌ను స్థాపించారు.

ఈ బేనర్‌పైనే వరుణ్‌ తేజ్‌ సినిమా రూపొందనుంది. ‘‘మంచి రోజు మంచి వార్త’’ అన్నారు వరుణ్‌ తేజ్‌.‘‘14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ తొలి సినిమా సాగర్‌ చంద్ర దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందనుందని శుభప్రదమైన ఉగాది రోజున ప్రకటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత రామ్‌ ఆచంట.

Advertisement
 
Advertisement
Advertisement