
తెలుగులో బిగ్‌బాస్ షో మొదలై వారం రోజులైంది. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. అయితే ప్రారంభం నుంచి ఏ మాత్రం జోష్ లేకుండా సాగుతోంది. మరోవైపు మలయాళంలోనూ 7వ సీజన్ షురూ అయి దాదాపు నెలరోజులకు పైనే అయింది. అక్కడ కూడా సాదాసీదాగానే సాగుతున్న షో కాస్త ఇప్పుడు మోహన్ లాల్ కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఓ లెస్బియన్ జంటని లేడీ కంటెస్టెంట్ అవమానించడమే దీనికి కారణం. ఇంతకీ అసలేమైంది?
(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)
మలయాళ బిగ్‌బాస్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. దీనికి మోహన్ లాల్ హోస్ట్. రీసెంట్‌గా వీకెండ్ ఎపిసోడ్‌లో ఈయన విశ్వరూపం చూపించాడు. లక్ష‍్మీ అనే కంటెస్టెంట్.. అదిలా-నూరా అనే లెస్బియన్ జంటపై దారుణమైన కామెంట్స్ చేసింది. 'అసలు మిమ్మల్ని ఈ హౌసులోకి ఎవరు రానిచ్చారు? మీకు ఇక్కడికి వచ్చేందుకు ఏ మాత్రం అర్హత లేదు' అని అనేసింది.
దీంతో మోహన్ లాల్.. హౌస్‌మేట్ లక్ష‍్మీపై ఫుల్ ఫైర్ అయిపోయారు. 'అసలు హౌసులోకి రావడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు?' అని మోహన్ లాల్ ప్రశ్నించాడు. తన కామెంట్స్‌ని కవర్ చేసేందుకు లక్ష‍్మీ ప్రయత్నించగా.. 'వాళ్లని నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త ఆలోచించు. అసలు ఇలా మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది? వాళ్ల పక్కన ఉండలేకపోతే హౌస్ నుంచి వెళ్లిపో. గెటౌట్' అని మోహన్ లాల్ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హౌస్టింగ్ అంటే ఇది అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్)