
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.
భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!
అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్‌లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్‌కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్‌లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది.
చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?