
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసిన ఏకైక కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ హరీశ్. నేను మోనార్క్‌ను, ఎవరి మాటా వినను అన్న టైప్‌లో ప్రవర్తిస్తుంటాడు. అగ్నిపరీక్షలో అడుగుపెట్టినప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడి జడ్జిలనే ఆగం చేశాడు. తనలో సగమైన భార్య కోసం తన పేరును హరిత హరీశ్‌గా మార్చుకున్నాడు.
నేనేమైనా గుడిలో గంటనా?
కానీ, ఓసారి కోపం వచ్చి ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలిపాడు. ఈ ఒక్కమాటతో అందరూ నోరెళ్లబెట్టారు. భార్యపై చేయి చేసుకునేంత దుర్మార్గుడివా? మూర్ఖుడివా? అని తిట్టిపోశారు. తాజాగా ఈ వివాదంపై హరీశ్ (Mask Man Harish) సతీమణి హరిత స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇదేమైనా గుడిలో గంటా? స్కూల్ బెల్లా? ఉదయం, సాయంత్రం కొట్టడానికి? ప్రతి కుటుంబంలో చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తను నన్ను కొట్టిన సంఘటన కూడా పెద్దగా గుర్తులేదు.
అందుకే హృదయ్ మానవ్
ఎందుకంటే మా మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అలాంటిది! 20 ఏళ్ల జీవితంలో మేము ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నాం. అవన్నీ వదిలేసి దాన్ని పట్టుకుని వేలాడలేం. షో కోసం అబద్ధం చెప్పకుండా ఆయన దాన్నింకా గుర్తుపెట్టుకుని మరీ చెప్పాడు. హృదయంలో ఏదీ దాచుకోడు. అందుకే హృదయ మానవ్ అయ్యాడు. మా పెళ్లయి 15 ఏళ్లవుతోంది. మేమిలా దూరంగా, మాట్లాడుకోకుండా ఇన్నిరోజులు ఎప్పుడూ లేము. నా భర్త మంచివాడు. కావాలనే అతడిని నెగెటివ్ చేస్తున్నారు. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉంది, అదింకా బయటకు రావడం లేదు అని హరిత చెప్పుకొచ్చింది.