
తెలుగు బిగ్‌బాస్ సీజన్ నాలుగో వారం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిముఖం పట్టారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో కామనర్ హౌస్లో అడుగుపెట్టింది. అయితే హౌస్లో ఫుల్ అగ్రెసివ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్ హరీశ్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. టాప్-5 కంటెస్టెంట్స్లో ఒకరిగా ఉంటారనుకున్నా మాస్క్ మ్యాన్‌ను ఆడియన్స్ బయటకు పంపించేశారు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన మాస్క్ మ్యాన్ హరీశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు మాస్క్ మ్యాన్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. హోస్ట్ నాగార్జున ముందు కాలిమీద కాలు వేసుకుని ఎందుకు కూర్చున్నారు? సెలబ్రిటీలే మామూలుగా కూర్చుంటే.. కామనర్ అయిన మీరెందుకు అలా కూర్చోవాల్సి వచ్చిందని హరీశ్ను ప్రశ్నించారు.
దీనికి బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరీశ్ సమాధానం ఇచ్చారు. పుష్ప సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. ఇది నా కాలే.. ఇది నా కాలే.. అంటూ అల్లు అర్జున్ చేసిన సీన్ ఎగ్జాంపుల్‌గా చూపించారు. కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అగౌరవించడం అనే విషయం నాకు ఇప్పటికీ తెలియదన్నారు. అలా చేయడం తప్పేమీ కాదు.. మన కాలు అవతలి వాళ్ల మీద వేస్తే తప్పు అని వివరించారు. అవతలి వ్యక్తిని గౌరవించడం అనేది మన మాటల్లో కనపడుతుంది.. అంతే కానీ మన కంఫర్ట్ జోన్లో కూర్చుంటే డిస్ రెస్పెక్ట్ చేయడం కాదన్నారు. నాగార్జున అంటే నాకు చాలా గౌరవముందని మాస్క్ మ్యాన్ హరీశ్ వెల్లడించారు.