
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్‌దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..
మాస్క వెనక రహస్యం
సమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్‌లో సెటిలయ్యాడు.

అన్ని ఉద్యోగాల్లో..
ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్‌లో టీచర్‌గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్‌ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్‌కి దూరంగా ఉన్నారు.
యాక్సిడెంట్
2017లో హరీశ్‌కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్‌ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్‌ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్‌తోనే బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్‌లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్‌లో కొనసాగడం కష్టమే!
చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?