
తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) ప్రారంభమైంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సెలబ్రిటీల నుంచి శ్రష్టి వర్మ, కామనర్ల నుంచి మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడిక మూడోవారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. టెనెంట్లు.. ఐదుగుర్ని నామినేట్ చేయాలన్నాడు. అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయుండాలన్నారు.
నామినేషన్స్
కెప్టెన్ అయ్యాక సంజనాకు అహం పెరిగిపోయిందని హరీశ్, ప్రియ.. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వదని శ్రీజ అభిప్రాయపడ్డారు. అలా మొదట సంజనాను నామినేట్ చేశారు. అలాగే రీతూ చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. ఇక టెనెంట్స్‌లో ఒకర్ని అనగానే అందరూ కలిసి హరీశ్‌ను నామినేషన్స్‌లో ఇరికించేశారు. ఇంతటితో అయిపోలేదు. బిగ్‌బాస్ ఈ ప్రక్రియలో ఓ ట్విస్ట్ ఇచ్చాడట!
గండం గట్టెక్కిన సంజనా
నామినేషన్స్‌లో ఉన్నవారు ఎవరితోనైనా స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడట! దీంతో సంజనా.. రాము రాథోడ్‌తో స్వాప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టెనెంట్స్‌లోనుంచి ప్రియ, కల్యాణ్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి రీతూ, సుమన్, ఫ్లోరా, రాము, ప్రియ, కల్యాణ్, హరీశ్ నామినేషన్స్‌లో ఉన్నారా? లేదంటే మళ్లీ ఏవైనా ట్విస్టులు ఇచ్చారా? అన్నది ఎపిసోడ్‌లో చూడాలి!
చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే?