
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్‌బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.
షేడ్స్ చూపిస్తున్న కామనర్స్
ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్‌బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్‌లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్‌బాస్. కామనర్స్‌ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.
చేతులెత్తి దండం పెట్టిన తనూజ
అంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్‌కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.
అర్హత లేదని హెచ్చరిక
ఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.
చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!