breaking news
Sitaare Zameen Par Movie
-
వంద రూపాయలకే రూ.260 కోట్ల సినిమా.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది. -
ప్రపంచంలోనే ఎత్తయిన చోట ఆ సినిమా ప్రదర్శన.. థియేటర్ స్పెషల్ ఏంటంటే?
సందేశాత్మక సినిమాను తీయడం ఒకెత్తయితే... ఆ సినిమాను సకల జనులకు చేరువగా తీసుకువెళ్లడం మరొకెత్తు. ఇలాంటి ఎత్తులను అధిరోహించినప్పుడే ఆ చిత్రం సంపూర్ణ శిఖరాగ్రం చేరుకున్టట్టు అర్ధం. ప్రస్తుతం అతి తక్కువ సినిమాలు మాత్రమే అలా శిఖరారోహణ చేయగలుగుతున్నాయి. ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మరోవైపు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న.... బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్వీయ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన సితారె జమీన్ పర్ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చోట ఉన్న థియేటర్ లో ప్రదర్శించారు. గత 13న భారతదేశంలో ఉన్న అత్యధిక ఎతైన థియేటర్ లో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ థియేటర్ పేరు పిక్చర్‌టైమ్. ఈ 11,562 అడుగుల ఎత్తున ఉన్న లడఖ్‌లోని మొబైల్ డిజిటల్ థియేటర్లో అమీర్ ఖాన్ నటించిన కామెడీ–డ్రామా చిత్రం’ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఆటిజం చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రేక్షకులుగా హాజరవగా, స్థానిక డా.దాయ్చిన్స్ హోప్‌ఫుల్ స్టెప్స్ క్లినిక్ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. థియేటర్ బయట, అందమైన లడఖ్ నేపధ్యంలో చిన్నారులు సినిమాలోని హాస్యానికి, ఉత్తేజానికి అనర్గళంగా నవ్వుతూ ఆనందించగా, వారి తల్లిదండ్రులు పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషం చూసి మురిసిపోతూ కనిపించారు. అమీర్ ఇటీవల ‘‘భారతీయ సినిమాలు అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’’ అని వేవ్స్సమ్మిట్లో అభిప్రాయపడ్డారు. అచ్చంగా దీన్నే పిక్చర్ టైమ్ సంస్థ అనుసరించింది. ఈ సందర్భంగా పిక్చర్ టైమ్ నిర్వాహకులు సుశీల్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఒక అమూల్యమైన వీక్షణ అనుభవం అన్నారు. ధియేటర్ విశేషాలివే... భారతదేశంలో, బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎతైన సినిమా థియేటర్, లడఖ్‌లోని లేహ్‌లో ఉన్న పిక్చర్‌టైమ్ డిజిప్లెక్స్ ఇన్ఫ్లేటేబుల్ థియేటర్, దీనిని లేహ్‌లోని ఎన్ఎస్డీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. సరసమైన ధరలోనే టిక్కెట్లు, మంచి సీటింగ్ ఏర్పాట్లతో కూడిన ఈ మొబైల్, ఇన్ప్లేటేబుల్ థియేటర్‌ను మారుమూల ప్రాంతాలకు కూడా సినిమా వీక్షణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగేళ్ల క్రితం విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్‌తో థియేటర్ ప్రారంభం కాగా అదే రోజున బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్‌బాటమ్‘ చిత్ర ప్రదర్శన కూడా జరిగింది.చలికాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి తరచుగా దూరమయ్యే ప్రాంతం లడఖ్‌కు ఈ మొబైల్ థియేటర్ స్థాపన చాలా ముఖ్యమైనది. వినోదానికి మూలాన్ని స్థానిక చిత్రనిర్మాతలు కళాకారులకు వేదికను ఈ థియేటర్ అందిస్తుంది ఈ మొట్టమొదటి మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ –28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో సైతం పనిచేసేలా ప్రత్యేక సాంకేతికతతో ఏర్పాటైంది. -
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
ఆమిర్ కొత్త సినిమా.. Day 1 కలెక్షన్స్ ఎంత?
రీసెంట్ టైంలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018లో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'తో వస్తే దారుణమైన డిజాస్టర్. 2022లో 'లాల్ సింగ్ చద్దా'తో వస్తే అదే సీన్ రిపీట్. దీంతో విపరీతమైన ట్రోలింగ్. కట్ చేస్తే యాక్టింగ్ కొన్నాళ్ల పాటు చేయనని చెప్పిన ఆమిర్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సితారే జమీన్ పర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి తొలిరోజు ఎంత కలెక్షన్ వచ్చాయంటే?స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్'కి రీమేక్‌గా 'సితారే జమీన్ పర్' సినిమా తీశారు. రిలీజ్‌కి ముందే ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో కాస్త హడావుడి చేశాడు గానీ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.11.5 కోట్ల మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజైన హిందీ చిత్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన 6వ చిత్రంగా నిలిచింది. అయితే ఆమిర్ స్టార్‌డమ్‌కి ఈ కలెక్షన్ చాలా తక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?)ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో తీస్తున్న సినిమాలే తొలిరోజు రూ.10-20 కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. అలాంటిది ఆమిర్ ఖాన్ సినిమాకు తొలిరోజు దాదాపు రూ.11 కోట్లు మేర వసూళ్లు రావడం అంటే ఆలోచించాల్సిన విషయం. అయితే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్స్‌లో ఈ నంబర్స్ పెరగొచ్చేమో చూడాలి? ఈ సినిమాని ఏ ఓటీటీకి అమ్మని ఆమిర్.. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. ఢిల్లీ బాస్కెట్ బాల్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా గుల్షన్ అరోరా(ఆమిర్ ఖాన్) పనిచేస్తుంటాడు. హెచ్ కోచ్‌తో గొడవ జరిగి అతడిని కొడతాడు. ఆ కోపంలో తాగి బండి నడిపి పోలీస్ వాహనాన్ని గుద్దేస్తాడు. దీంతో కోర్ట్.. శిక్ష విధించకుండా మానసిక దివ్యాంగులకు మూడు నెలల పాటు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. అలా 10 మంది దివ్యాంగులకు కోచ్‌గా మారతాడు. వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో గుల్షన్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? నేషనల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో 'సితారే' టీమ్ గెలిచిందా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)