
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అంటూ అభిమానులను పలకరించాడు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా.. అమిర్ ఖాన్ నిర్మించారు. గతనెల 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో విడుదలైన అమిర్ ఖాన్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఓటీటీకి ఇచ్చేది లేదన్న అమిర్..
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోనని అమిర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాను ముందుగానే ప్రకటించినట్లు యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రూ. 100 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చని తెలిపారు. ఈ చిత్రం ఆమిర్ ఖాన్ అధికారిక యూట్యూబ్ ఛానల్.. ఆమిర్ ఖాన్ టాకీస్: జనతా కా థియేటర్‌లో రూ. 100కు అందుబాటులో ఉండనుంది.