ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది | Mahesh Babu Review on Taare Zameen Par Movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu: నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. లేటెస్ట్‌ సినిమాపై మహేశ్‌ ప్రశంసలు

Jun 23 2025 1:52 PM | Updated on Jun 23 2025 3:38 PM

Mahesh Babu Review on Taare Zameen Par Movie

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్‌ పర్‌ (Sitaare Zameen Par). ‘సబ్‌ కా అప్న అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆమిర్‌ఖాన్  నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్  పర్‌’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్‌ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్‌ పర్‌.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.

సితారే జమీన్‌ పర్‌ మూవీలో ఆమిర్‌ ఖాన్‌, జెనీలియా జంటగా నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్‌  నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్  మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

 

 

చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష

Advertisement
 
Advertisement
Advertisement