
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'పరమ్ సుందరి'. ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫుల్ రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బీగీ శారీ అంటూ సాగే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో సిద్ధార్థ్- జాన్వీల కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వర్షంలో చేసిన ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ అద్భుతమైన సాంగ్ను శ్రేయా ఘోషల్, అద్నాన్ సమీ, సచిన్ జిగర్ ఆలపించారు. ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. సచిన్ జిగర్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.