
కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మళ్లీ బుల్లితెరపై కనిపించారు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ' (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియల్ గత నెల నుంచే ప్రసారం అవుతుంది. అయితే, ఈ సిరీయల్ కోసం తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది తాజాగా స్మృతి ఇరానీ పంచుకున్నారు. తాను ఫుల్‌టైమ్ రాజకీయనాయకురాలు అని, పార్ట్‌టైమ్ యాక్టర్ అని ఆమె ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ -2 సీరియల్‌తో తులసి విరానీగా స్మృతి ఇరానీ తిరిగొచ్చారు. అయితే,తాను ఈ సిరీయల్ నటించేందుకు ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 14 లక్షలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా CNN-News18తో ఆమె మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. నిరంతరం మనం ఏదో పనిలో ఉంటూనే ముందుకు వెళ్లాలని చెప్పారు. కేవలం ఆదాయం కోసమే పనిచేస్తే అనుకున్నది సాధించడం కష్టమని స్మృతి తెలిపారు. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సీరియల్ నటిగా స్మృతి ఇరానీ రికార్డ్ క్రియేట్ చేశారు. హిందీలో బాగా పాపులర్ అయిన 'అనుపమ' సీరియల్ కోసం రూపాలీ గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆ రికార్డ్‌ను స్మృతి ఇరానీ దాటేశారు. మరో నటి హీనా ఖాన్ కూడా ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు.
సుమారు 25 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ నటించిన హిందీ సీరియల్ 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ'. ఈ సీరియల్‌తో స్మృతి ఇరానీకి మంచి గుర్తంపు దక్కింది. 2000 ఏడాదిలో మొదలైన ఈ ధారావాహిక 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో నటించిన స్మృతి ప్రేక్షకుల ఆదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. దానికి సీక్వెల్‌గానే 'క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2' జులై 29 నుంచి ప్రసారం అవుతుంది.