మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష | Trisha Krishnan Reveals Interesting Points about Mahesh Babu an Old Interview | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: మహేశ్‌బాబుతో కలిసి పనిచేసినప్పుడు గిల్టీగా ఫీలయ్యా..

Jun 23 2025 12:59 PM | Updated on Jun 23 2025 2:54 PM

Trisha Krishnan Reveals Interesting Points about Mahesh Babu an Old Interview

అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్‌ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్‌ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మహేశ్‌, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్‌ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్‌ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

షూటింగ్‌ అయిపోగానే..
త్రిష మాట్లాడుతూ.. మహేశ్‌ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్‌ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్‌. చాలా హార్డ్‌వర్క్‌ చేస్తారు. నాకేమో.. షూటింగ్‌ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్‌కు వచ్చిన మహేశ్‌ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.

ఎప్పుడూ మానిటర్‌ దగ్గరే..
తను వానిటీ వ్యాన్‌కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్‌ షూట్‌ లేనప్పుడు కూడా.. మానిటర్‌ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్‌బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

Advertisement
 
Advertisement
Advertisement