
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (50), పినాకి మిశ్రా (65) వెడ్డింగ్ రిసెప్షన్ బుధవారం ఢిల్లీలో జరిగింది.

ఢిల్లీలోని హోటల్ లలిత్‌లో జరిగిన ఈ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

మహువా మొయిత్రా రెడ్ గోల్డెన్ జరీ చీరలో, బంగారు ఆభరణాలతో అద్భుతంగా కనిపించారు.

పినాకి మిశ్రా రెడ్ బోర్డర్ ఉన్న వైట్ డ్రెస్‌లో సాంప్రదాయ లుక్‌లో అలరించారు.

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తృణమూల్ ఎంపీలు సాయనీ ఘోష్, సాగరికా ఘోష్, జూన్ మాలియా, రచనా బెనర్జీ, ఇంకా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే వంటి ప్రముఖులు విచ్చేశారు.

ఈ ఏడాది మే 3న జర్మనీలో బెర్లిన్‌లోని చారిత్రాత్మక ప్యాలెస్‌లో అత్యంత గోప్యంగా మిశ్రా, మహువా వివాహం చేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు మహువా మొయిత్రా. పార్లమెంట్‌లో పదునైన సంభాషణలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పినాకి మిశ్రా, మహువాలకు ఇది రెండో వివాహం

పినాకి మిశ్రా, మహువా దంపతులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు

పినాకి మిశ్రా, మహువా వివాహ రిసెప్షన్‌లో మహిళా నేతలు




పినాకి మిశ్రా, మహువా వివాహ రిసెప్షన్‌లో అఖిలేశ్ యాదవ్, డింపుల్ యాదవ్ దంపతులు