Dolby atmas Technology
-
Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్: అల్లు అర్జున్
హైదరాబాద్‌లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.అల్లు అరవింద్‌ను టెక్నాలజీ పయనీర్‌గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్‌ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్‌ను హైదరాబాద్‌కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్‌లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్‌లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్‌లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్‌కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి. -
దేశ సినీ చరిత్రలోనే మొదటిసారి.. ఆవిష్కరించిన రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశారు. మనదేశంలోనే మొట్టమొదటిసారి ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన డాల్బీ పోస్ట్ ప్రొడక్షన్(Dolby Technology)ను ప్రారంభించారు. సినీ ఇండస్ట్రీలో ఇండియాలో ఇప్పటివరకు అందుబాటులో లేని డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణంలో ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా సినిమాలను తెరకెక్కించనున్నారు. ఆడియన్స్‌కు సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. అది కూడా మన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించడం మరో విశేషం.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. 'ఆర్ఆర్ఆర్ సమయంలో డాల్బీ విజన్‌లో సినిమాను అప్ గ్రేడ్ చేయాలనుకున్నా. కానీ ఆ టెక్నాలజీ మనదగ్గర లేదు. దాని కోసం మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది నాకు కొంత వరకు నిరుత్సాహానికి గురిచేసింది. నా సొంత దేశంలో నా సినిమాని డాల్బీ విజన్‌లో చూడలేకపోయానని నిరాశకు గురయ్యా. కానీ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ సదుపాయాన్ని చూసి థ్రిల్ అయ్యా. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నా నెక్ట్స్ మూవీ విడుదలయ్యే సమయానికి భారతదేశం అంతటా బహుళ డాల్బీ సినిమాలు ఉంటాయి. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లోని కథనాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రేక్షకులు ఈ డాల్బీ సదుపాయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.అనంతరం నాగార్జున మాట్లాడుతూ..'వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండటం కోసం ఎల్లప్పుడు ముందుంటాం. దేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సినిమాను వరల్డ్ మ్యాప్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా డాల్బీని ఏర్పాటు చేయడం విశేషం. అత్యాధునికి టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలకు మరో ముందడుగు"అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్కు సంబంధించిన స్పెషల్ ఫుటేజ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రదర్శించారు.మహేశ్ బాబుతో రాజమౌళి..కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు మన జక్కన్న. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈనెల చివరి వారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. జనవరి 2న హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లోనే చిత్రయూనిట్ సభ్యుల సమక్షంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది.హీరోయిన్‌పై చర్చ..కాగా.. మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. ఇటీవల ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అయింది. -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్
న్యూఢిల్లీ : రాబోయే 2-3 సంవత్సరాల్లో ‘పీవీఆర్ టాకీస్’ బ్రాండ్ కింద సుమారు 150 చౌక స్క్రీన్స్‌ను (థియేటర్స్) ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మూవీ థియేటర్స్ సంస్థ పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లి వెల్లడించారు. కొత్త టెక్నాలజీ ‘డాల్బీ అట్మాస్’ కోసం డాల్బీ ల్యాబరేటరీస్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా అజయ్ ఈ విషయాలు తెలిపారు. దాదాపు 50 పీవీఆర్ స్క్రీన్స్‌లో సుమారు రూ.40 కోట్లతో డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పీవీఆర్ టాకీస్ పేరిట ప్రస్తుతం 80 స్కీన్లున్నాయి. మొత్తం అన్ని బ్రాండ్లు కలిపి 43 నగరాల్లో 474 స్క్రీన్స్ ఉన్నాయి.


