మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్ | Another 150 theaters in three years: PVR | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్

Jul 29 2015 1:33 AM | Updated on Sep 3 2017 6:20 AM

మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్

మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్

రాబోయే 2-3 సంవత్సరాల్లో ‘పీవీఆర్ టాకీస్’ బ్రాండ్ కింద సుమారు 150 చౌక స్క్రీన్స్‌ను (థియేటర్స్) ప్రారంభించాలని

 న్యూఢిల్లీ : రాబోయే 2-3 సంవత్సరాల్లో ‘పీవీఆర్ టాకీస్’ బ్రాండ్ కింద సుమారు 150 చౌక స్క్రీన్స్‌ను (థియేటర్స్) ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మూవీ థియేటర్స్ సంస్థ పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లి వెల్లడించారు.  కొత్త టెక్నాలజీ ‘డాల్బీ అట్మాస్’ కోసం డాల్బీ ల్యాబరేటరీస్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా అజయ్ ఈ విషయాలు తెలిపారు. దాదాపు 50 పీవీఆర్ స్క్రీన్స్‌లో సుమారు రూ.40 కోట్లతో డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పీవీఆర్ టాకీస్ పేరిట ప్రస్తుతం 80 స్కీన్లున్నాయి. మొత్తం అన్ని బ్రాండ్లు కలిపి 43 నగరాల్లో 474 స్క్రీన్స్ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement