breaking news
AJAY BIJLI
-
మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్
న్యూఢిల్లీ : రాబోయే 2-3 సంవత్సరాల్లో ‘పీవీఆర్ టాకీస్’ బ్రాండ్ కింద సుమారు 150 చౌక స్క్రీన్స్‌ను (థియేటర్స్) ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మూవీ థియేటర్స్ సంస్థ పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లి వెల్లడించారు. కొత్త టెక్నాలజీ ‘డాల్బీ అట్మాస్’ కోసం డాల్బీ ల్యాబరేటరీస్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా అజయ్ ఈ విషయాలు తెలిపారు. దాదాపు 50 పీవీఆర్ స్క్రీన్స్‌లో సుమారు రూ.40 కోట్లతో డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పీవీఆర్ టాకీస్ పేరిట ప్రస్తుతం 80 స్కీన్లున్నాయి. మొత్తం అన్ని బ్రాండ్లు కలిపి 43 నగరాల్లో 474 స్క్రీన్స్ ఉన్నాయి. -
కొత్తగా వంద స్క్రీన్లు : పీవీఆర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందకు పైగా కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నామని మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ శుక్రవారం తెలిపింది. ఇందుకోసం రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పీవీఆర్ ఎండీ, అజయ్ బిజిలి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వంద స్క్రీన్లలలో సగం మెట్రో నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న 400 స్క్రీన్లకు ఇవి అదనమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏడాది వంద స్క్రీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొత్తం స్క్రీన్ల సంఖ్యను వెయ్యికి పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో సినిమా హాళ్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. భారత్‌లో వినోదపు పన్ను అధికంగా ఉందని, ఈ పన్నును తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.