
రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’(Paisawala Movie). కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై కె. నవీన్ తేజస్, నూనెల పైడిరాజు, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, “‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రానికి నగేష్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పైసావాలా’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.