breaking news
Paisawala Movie
-
పసుపు అంటిన పది నోటు ఎక్కడ.. ఆసక్తికరంగా ‘పైసావాలా’ ట్రైలర్!
కంటెంట్ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్‌ని కంటె కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్ చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ట్రైలర్ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఫోన్, పర్సు మిస్ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 12న విడుదల కానుంది. -
Paisawala: ఆకట్టుకుంటున్న ‘పైసా.. పైసా’ సాంగ్
అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పైసావాలా’. కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లవ్ సాంగ్ ‘ఏమైందిదో ..’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అధ్విక్, దర్శకుడు కె. నవీన్ తేజస్, నిర్మాతలు పైడిరాజు, పి.ఎస్.ఎన్. రాజు హాజరయ్యారు.‘జీవుల మనుగడకు సృష్టించిన పైసా.. జీవం లేకున్నా నిర్జీవిరా పైసా’ అంటూ సాగే ఈ పాటకు నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, కాకి లక్ష్మణ్‌రెడ్డి ఆలపించారు. డబ్బుతో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలియజేసేలా ఈవీఆర్ & గురుబిల్లి జగదీష్ ఈ పాటను రచించారు. గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘పైసావాలా’ విజయం సాధించాలి: శ్రీలీల
రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పైసావాలా’(Paisawala Movie). కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, వీకేఎం మూవీస్ బ్యానర్లపై కె. నవీన్ తేజస్, నూనెల పైడిరాజు, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ, “‘పైసావాలా’ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ చిత్రానికి నగేష్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పైసావాలా’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.


