పసుపు అంటిన పది నోటు ఎక్కడ.. ఆసక్తికరంగా ‘పైసావాలా’ ట్రైలర్‌! | Paisawala Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Paisawala Movie Trailer: పసుపు అంటిన పది నోటు ఎక్కడ?

Dec 2 2025 5:28 PM | Updated on Dec 2 2025 5:28 PM

Paisawala Movie Trailer Out

కంటెంట్‌ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్‌ని కంటె కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు.  

ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ట్రైలర్‌ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్‌ అయింది. ఆ తర్వాత ఫోన్‌, పర్సు మిస​్‌ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే  అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి  నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్‌ 12న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement