
యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా 'జూనియర్'లో వైరల్ వయ్యారిగా తెగ సందడి చేస్తోంది. సరే ఈ సంగతులు పక్కనబెడితే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఈమె ప్రేమలో ఉందనే రూమర్స్ గత కొన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల ఈ పుకార్లతో పాటు తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.
(ఇదీ చదవండి: 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ)
'నేను లవ్ చేస్తున్నానని అంతా అనుకుంటున్నారు. కానీ నేనెలా ప్రేమలో పడగలను. ప్రతిసారి అమ్మ నాతో ఉంటోంది. అయినాసరే నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. లేకలేక మియామీ వెళ్లినప్పుడు కూడా నా వెంట అమ్మ వచ్చింది. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడతాను చెప్పండి' అని శ్రీలీల క్యూట్‌గా క్లారిటీ ఇచ్చింది.
కొన్నిరోజుల క్రితం పెళ్లి కూతురిలా రెడీ వాటిని శ్రీలీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అంతా ఈమెకు పెళ్లి అని ఫిక్సయ్యారు. కానీ అది తన పుట్టినరోజు, అలా బుట్టలో తీసుకెళ్లడం తన కుటుంబ సంప్రదాయం అని చెప్పింది. దీంతో కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక పెళ్లి విషయమై స్పందించిన శ్రీలీల.. తనకు ఇప్పుడు 23 ఏళ్లు అని, ఎలా లేదన్నా 30 ఏళ్లు వచ్చేవరకు తను అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. మరి అప్పుడైనా ప్రేమ వివాహమా? లేదంటే పెద్దల కుదిర్చిన పెళ్లా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)