
సెలబ్రిటీలు వ్యాపార ప్రకటనలు చేయడం సహజం. అయితే, దాని బడ్జెట్ అనేది హీరో రేంజ్‌ను బట్టి ఉంటుంది. కానీ, బాలీవుడ్‌లో ఒక యాడ్ కోసం ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. చింగ్స్ దేశీ చైనీస్ (Ching’s Desi Chinese) అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్‌ను రంగంలోకి దించింది. ఈ వాణిజ్య ప్రకటనను దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.
ఈ యాడ్‌లో రణ్‌వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా కనిపిస్తే.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా మెరిసింది. విలన్‌గా బాబీ డియోల్ ప్రోఫెసర్ వైట్ నాయిస్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ప్రోమో విడుదల చేశారు. పూర్తి వీడియోను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. రణ్‌వీర్ సింగ్ గతంలో కూడా చింగ్స్ దేశీ చైనీస్ కోసం యాడ్స్ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన పనిచేశారు. అందులో తమన్నా భాటియాతో కలిసి ఓ ఇన్‌స్టంట్ నూడుల్స్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్ కోసం స్టార్ యాక్టర్స్ నటించడంతో రెమ్యునరేషన్ భారీగా తీసుకున్నట్లు సమాచారం. అందుకే బడ్జెట్ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్.