
యానిమేషన్ చిత్రం'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో ఇదే ట్రెండ్‌ను పలు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యానిమేటెడ్ చిత్రం కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో పార్ట్-2 ను దర్శకుడు ఉజాన్ గంగూలీ రూపొందించారు. తాజాగా కురుక్షేత్ర-2 ట్రైలర్‌ను షేర్ చేశారు. అక్టోబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది.

'కురుక్షేత్ర-1' కథేంటి?
అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ?