breaking news
Kurukshetra Series
-
'కురుక్షేత్ర-2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యానిమేషన్ చిత్రం'మహావతార్ నరసింహా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో ఇదే ట్రెండ్‌ను పలు సినిమాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యానిమేటెడ్ చిత్రం కొద్దిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ మూవీకి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీంతో పార్ట్-2 ను దర్శకుడు ఉజాన్ గంగూలీ రూపొందించారు. తాజాగా కురుక్షేత్ర-2 ట్రైలర్‌ను షేర్ చేశారు. అక్టోబర్ 24న నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది.'కురుక్షేత్ర-1' కథేంటి?అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత పాండవులకు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులు.. రాజ్యంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మాట తప్పుతారు. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తారు. కృష్ణుడి సూచన మేరకు పాండవులు ఓపిగ్గానే ఉంటారు. సంజయుడితో కౌరవులకు రాయబారం పంపిస్తారు. కానీ అది విఫలమవుతుంది. కౌరవులు.. యుద్ధం పట్ల ఉత్సాహంగా ఉన్నారనే విషయం పాండవులకు తెలుస్తుంది. దీంతో కృష్ణుడు, అర్జునుడు వైపు.. కృష్ణుడి సైన్యం దుర్యోధనుడికి దక్కుతుంది. అలా 'కురుక్షేత్రం' మొదలవుతుంది. ఆయుధాలే పట్టనని అనుకున్న అర్జునుడు.. కృష్ణుడి గీతోపదేశం తర్వాత ఎలా మారాడు? ఈ యుద్ధంలో అసలేం జరిగిందనేది అసలు కథ? -
కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం'
ఇప్పటి జనరేషన్‌కి పురాణాలు, ఇతిహాసాల గురించి కాస్త తక్కువగానే తెలుసు. అలానే రీసెంట్ టైంలో ఈ జానర్లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నెలన్నర క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దారిలోనే తెలుగులోనూ 'వాయుపుత్ర' అనే సినిమా రాబోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా)మహాభారతంలోని కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబరు 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అను సిక్కా ఈ సిరీస్ క్రియేటర్ కాగా.. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించారు. మరి ఈ 'కురుక్షేత్ర' సిరీస్.. ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి?Shankhnaad ke sath arambh hoga dharm aur adharm ka mahayudh ⚔🔥Watch Kurukshetra, out 10 October, only on Netflix.#KurukshetraOnNetflix pic.twitter.com/z4shkPyu1g— Netflix India (@NetflixIndia) September 10, 2025


