కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం' | Kurukshetra Animated Series to Stream on Netflix from October 10 | Sakshi
Sakshi News home page

Kurukshetra Ott: ఓటీటీ సిరీస్‌గా మహాభారతంలోని కీలక ఘట్టం

Sep 10 2025 12:54 PM | Updated on Sep 10 2025 12:59 PM

Kurukshetra Animated Series OTT Streaming Details

ఇప్పటి జనరేషన్‌కి పురాణాలు, ఇతిహాసాల గురించి కాస్త తక్కువగానే తెలుసు. అలానే రీసెంట్ టైంలో ఈ జానర్‌లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నెలన్నర క్రితం థియేటర్లలో రిలీజైన 'మహావతార్ నరసింహ' అనే యానిమేటెడ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దారిలోనే తెలుగులోనూ 'వాయుపుత్ర' అనే సినిమా రాబోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా' స్పూర్తి.. తెలుగులోనూ యానిమేషన్ సినిమా)

మహాభారతంలోని కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబరు 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అను సిక్కా ఈ సిరీస్ క్రియేటర్ కాగా.. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించారు. మరి ఈ 'కురుక్షేత్ర' సిరీస్.. ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement