
లేడీ ఓరియెంటెడ్ అనగానే తెలుగులో కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అందులో కచ్చితంగా టాప్‌లో ఉండే పేరు 'అరుంధతి'. అప్పటివరకు గ్లామరస్ హీరోయిన్‌గా చేస్తున్న అనుష్క.. జీవితాన్నే మార్చేసిన మూవీ ఇది. రిలీజై దాదాపు 14 ఏళ్లు అవుతున్నా సరే దీన్ని కొట్టే ఇంతవరకు రాలేదని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు దీన్ని రీమేక్ చేసే ప్లాన్ రెడీ చేస్తున్నారట. శ్రీలీలని లీడ్ రోల్ అనుకుంటున్నారట. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!)
'అరుంధతి' సినిమాని దక్షిణాదితో పాటు పలు భాషల్లో చాన్నాళ్ల క్రితమే రీమేక్స్ చేశారు. అయితే అనుష్క శెట్టిని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు. హిందీలోనూ దీపికా పదుకొణెతో గతంలో ఈ రీమేక్ చేయాలని అనుకున్నప్పటికీ ఎందుకో కుదర్లేదు. ఇన్నాళ్లకు ఇది సెట్ అవబోతుందని టాక్ వినిపిస్తుంది. హిందీలో ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్‌తో ఓ మూవీ చేస్తున్న శ్రీలీల.. ఈ రీమేక్ చేయబోతుందని అంటున్నారు.
రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలు డైరెక్ట్ చేసిన మోహన్ రాజా.. ఈ రీమేక్ తీయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉందని, త్వరలో ఈ రీమేక్ గురించి గుడ్ న్యూస్ చెబుతారని టాక్ నడుస్తోంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్సేనా లేదంటే నిజంగానే కాంబో సెట్ కానుందా అనేది చూడాలి? అయితే శ్రీలీలతో 'అరుంధతి' అనే రూమర్స్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్‌గా హీరోయిన్ నిశ్చితార్థం?)