ఏడాదిగా డేటింగ్.. సీక్రెట్‌గా హీరోయిన్ నిశ్చితార్థం? | Huma Qureshi Engaged With Boyfriend Rachit Singh | Sakshi
Sakshi News home page

Huma Qureshi: 40 ఏళ్లకు పెళ్లికి రెడీ.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్!

Sep 15 2025 6:25 PM | Updated on Sep 15 2025 7:19 PM

Huma Qureshi Engaged With Boyfriend Rachit Singh

మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది. బాలీవుడ్‌కి హ్యుమా ఖురేషి.. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏడాది నుంచి ఓ యాక్టింగ్ కోచ్‌తో ఈమె రిలేషన్‌లో ఉందని, రీసెంట్‌గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా వెళ్లొచ్చారని, ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం? హ్యుమా కాబోయే భర్త ఎవరు?

(ఇదీ చదవండి: నేను ధనుష్‌ని వెన్నుపోటు పొడవలేను: జీవీ)

'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపుర్' సినిమాలతో నటిగా పరిచయమైన హ్యుమా ఖురేషి.. 2012 నుంచి హిందీలో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. మలయాళంలో వైట్, తమిళంలో అజిత 'వలిమై', రజినీకాంత్ 'కాలా' చిత్రాల్లోనూ హీరోయిన్‍‌గా చేసింది. 'మహారాణి' వెబ్ సిరీస్‌తోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. గత ఏడాది నుంచి యాక్టింగ్ కోచ్ రచిత్ సింగ్‌తో ప్రేమలో ఉందని తెలుస్తోంది. హీరోయిన్ సోనాక్షి పెళ్లికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లారని, అయితే తమ రిలేషన్ గురించి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.

రీసెంట్‌గానే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా హ్యుమా-రచిత్ వెళ్లొచ్చారు. ఇప్పుడు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని బాలీవుడ్‌లో వినిపిస్తుంది. ఇది నిజమే అయినప్పటికీ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నారని సన్నిహితుల మాట. హ్యుమాకి ప్రస్తుతం 39 ఏళ్లు. రచిత్ విషయానికొస్తే ఉత్తరప్రదేశ్‌కి చెందిన కుర్రాడు. మోడలింగ్ చేసేటప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. 2016లో ముంబై వచ్చేసిన తర్వాత యాక్టింగ్ కోచ్‌గా మారిపోయి సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరి హ్యుమా-రచిత్.. తమ నిశ్చితార్థం నిజం ఎప్పుడు చెబుతారో చూడాలి?

(ఇదీ చదవండి: Bigg Boss 9 తెలుగు 2వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement