
ఈ మధ్య కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రీలీల. యాక్టింగ్ పరంగా ఈమెకు ఓ మాదిరి మార్కులు పడతాయి గానీ డ్యాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తోంది. కొన్నిరోజుల క్రితం తెగ హల్‌చల్ చేసిన 'వైరల్ వయ్యారి' పాటలోనూ శ్రీలీల మాస్ స్టెప్పులతో ఊపుఊపేసిందని చెప్పొచ్చు. అలాంటి ఈమె.. సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో పాల్గొంది. ఆసక్తికర సంగతుల్ని కొన్ని బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగానే రిలీజైంది.
'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ఈ షో.. గత వారమే లాంచ్ అయింది. తొలి ఎపిసోడ్ గెస్ట్‌గా హీరో నాగార్జున వచ్చారు. తన వ్యక్తిగత విషయాలు బోలెడన్ని పంచుకున్నారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ కోసం యంగ్ సెన్సేషన్ శ్రీలీలని తీసుకొచ్చారు. ఆ ప్రోమోనే ఇప్పుడు విడుదల చేశారు.
(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. భార్యకు సీమంతం)
శ్రీలీలని షోకి ఆహ్వానించిన జగపతిబాబు.. 'మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం. నువ్వు యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావ్' అని అన్నారు. దీంతో గతుక్కుమన్న శ్రీలీల.. సార్ తిట్టారా పొడిగారా అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది. 'గుంటూరు కారం' చేసేటప్పుడు లెఫ్ట్‌లోనో రైట్‌లోనో నీ ఫేస్ కొంచెం తేడా ఉండేది అని జగపతిబాబు అనగా.. 'ఆ టాపిక్ తీస్తే నేను మీ టాపిక్ తీసుకొస్తా సర్' అని శ్రీలీల చెప్పింది. 'మీ హీరోయిన్ గారు.. మీరు..' అంటూ వేలు చూపిస్తూ నవ్వేసింది.
'ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేశావ్' అని శ్రీలీలని ఉద్దేశించి జగపతిబాబు అనగానే.. 'దూల తీరిపోతుంది సార్' అంటూ శ్రీలీల తన బాధని నవ్వుతూనే బయటపెట్టింది. 'నీ మీద ఓ కంప్లైంట్ ఉందమ్మా' అంటూ జగ్గూ భాయ్ అనగానే.. శ్రీలీల తల్లి వెనక నుంచి ఈమెని సర్‌ప్రైజ్ చేసింది. 'మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ సార్' అని శ్రీలీల చెప్పగానే.. జగపతిబాబు అలా చూశాడు. శ్రీలీల ముసిముసిగా నవ్వింది. దీంతో 'నువ్వెందుకు అంతగా సిగ్గు పడుతున్నావ్' అని జగపతిబాబు అనేసరికి అందరూ నవ్వేశారు. ఈ శుక్రవారం ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)