
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి.
ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్‌గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.